PPM: జిల్లాలో చేపడుతున్న ‘జలధార’ పనులన్నింటినీ ఈ నెలాఖరు నాటికి ఖచ్చితంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్ నుంచి సంబంధిత శాఖల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై సుదీర్ఘంగా సమీక్షించారు. పనుల అమలులో ఎదురవుతున్న సమస్యలు, పెండింగ్ పనులు తదితర అంశాలపై ఆరా తీశారు.