NZB: మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఇవాళ ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమాన్ని ఉపాధ్యాయ బృందం ఘనంగా నిర్వహించింది. ఇందులో భాగంగా నిర్వహించిన విద్యార్థుల నమోదు కార్యక్రమంలో యూకేజీలో 8 మంది పిల్లలు చేరారు. అలాగే 1 నుంచి 5 తరగతి వరకు మరో ముగ్గురు విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నట్లు ప్రధానోపాధ్యాయుడు గంగాధర్ తెలిపారు.