TG: సికింద్రాబాద్లోని జూబ్లీ బస్టాప్ దగ్గర ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు ఒక్కసారిగా ప్రయాణికులపైకి దూసుకెళ్లడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ద్విచక్ర వాహనదారుడు శివ అనే వ్యక్తి బస్సు టైర్ల కింద ఇరుక్కుపోయాడు. శివను వాహనదారులు కాపాడి, ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.