NRML: 2026-27 విద్యా సంవత్సరానికి కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి దయానంద్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో చదివి పదో తరగతిలో 7 జీపీఏ సాధించిన విద్యార్థులు జూన్ 5లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.