NTR: విజయవాడలోని న్యూ జీజీహెచ్‌ను కలెక్టర్ లక్ష్మీశ శనివారం సందర్శించారు. అనంతరం ఆసుపత్రి ద్వారా రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. అదేవిధంగా ఆసుపత్రిలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యూత్ టైం బ్యాంక్ సేవలను ఈరోజు పరిశీలించారు. యూత్ టైం బ్యాంక్ మొబైల్ యాప్‌ను పరిశీలించి వాలంటీర్, రోగి వివరాలు టైం బ్యాంకులో నమోదయ్యే విధంగా చర్యలు చేపట్టారు.