GNTR: తెనాలిలో రంజాన్ పర్వదినం పూట తీవ్ర విషాదం నెలకొంది. మద్యం మత్తులో కాలువలో ఈతకు దిగి సయ్యద్ మహబూబ్ వలి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సుల్తానాబాద్‌కు చెందిన వలి, అతని స్నేహితుడు బుజ్జి రోజంతా మద్యం సేవించి, సాయంత్రం కాలువలోకి దిగారు. ఈ క్రమంలో వలి నీట మునిగిపోగా, గమనించిన స్థానికులు ఒడ్డుకు చేర్చేలోపే మృతి చెందాడు.