KMM: రంజాన్ సందర్భంగా నిరుపేదలకు చేయూతనివ్వడం గొప్ప సందేశమని టీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు కొనియాడారు. ఖమ్మం టీఎన్జీవో కార్యాలయంలో పరిశ సీతారత్నం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కమలాపురం గ్రామానికి చెందిన ఎం.ఫార్మసీ విద్యార్థిని వైష్ణవికి రూ. 20,000 ఆర్థిక సాయం చెక్కును అందజేశారు. విద్యార్థిని ఉన్నత చదువులు చదవాలని ఆయన ఆకాంక్షించారు.