AP: రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈ క్రమంలో విజయవాడ, నూజివీడు, భీమవరం, భీమడోలు, గుడివాడ, గన్నవరానికి వాతావరణశాఖ అలర్ట్ ప్రకటించింది. రానున్న మూడు గంటల్లో ఉరుములతో కూడిన వర్షం పడనుంది. గంటలకు 50 నుంచి 60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.