అన్నమయ్య: ములకలచెరువు మండలంలోని బురకాయలకోట పట్టణంలో ముస్లిం సోదరులు ఇవాళ రంజాన్ పండుగను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సమీపంలోని ఈద్గా వద్ద ర్యాలీగా వెళ్లి ప్రార్థనలు (నమాజులు) చేశారు. అనంతరం ఒకరినొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఖబ్రస్థాన్ వెళ్లి పూర్వీకుల ఆత్మ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.