NLG: కమ్యూనిస్టు నాయకత్వాన ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేసిన నర్రా రాఘవరెడ్డి నేటి తరం నాయకులకు ఆదర్శప్రాయుడని సీపీఎం రాష్ట్ర, జిల్లా కార్యదర్శులు జాన్ వెస్లీ, తుమ్మల వీరారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కొనియాడారు. చిట్యాల మండలం వట్టిమర్తి స్టేజి వద్ద నర్రా విగ్రహానికి ఇవాళ వారు నివాళులు అర్పించారు.