ATP: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ఓ.ఆనంద్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పర్యావరణ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పలువురు రైతులు, విద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు.