VZM: కొత్తవలస మండల తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న పొన్నాడ సునీత మండల తహసీల్దార్‌గా పదోన్నతి పొందారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఆమెను మన్యం జిల్లా కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. కొత్తవలస నుంచి రిలీవ్ అయ్యి మన్యం జిల్లాలో రిపోర్టు చేశారు. ఆమె స్థానంలో ఇంకా ఎవరిని భర్తీ చేయలేదు.