WGL: ఉమ్మడి జిల్లాలో ఎంపీల పాత్ర కేవలం అలంకారప్రాయంగా మారిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక్కో ఎంపీ పరిధిలో 6 నుంచి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నప్పటికీ నియోజకవర్గాల్లో పర్యటనలు తగ్గాయని పేర్కొంటున్నారు. గ్రామాల్లో కార్యక్రమాలకు పిలుపులు లేకపోవడం, అభివృద్ధి పనుల్లో సమన్వయం లోపించడంతో ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య దూరం పెరిగిందని అభిప్రాయపడుతున్నారు.