JN: పాలకుర్తి మండలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ భూములు పరిరక్షణ సమితి అధ్యక్షుడు దుంపల సంపత్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయన్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్థల పరిశీలన జరిపి, పాఠశాల నిర్మాణానికి తగిన ప్రాంతాన్ని ఎంపిక చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.