మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అటవీశాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయ సునీత పాల్గొన్నారు. కార్యాలయం ప్రాంగణంలో మొక్కలను నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని వారు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని కృషి చేయాలని కోరారు.