భారత్, ఆఫ్ఘానిస్థాన్ జట్ల మధ్య జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ముల్లాన్‌పుర్ వేదికగా ఈ మ్యాచ్ ఉదయం 9:30 గంటలకు మొదలవుతుంది. భారత్ జట్టుకు శుభ్‌మన్ గిల్, అఫ్గన్ జట్టుకు హజ్మతుల్లా షాహిదీ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన ఒకే ఒక్క టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది.