హీరో వైష్ణవ్ తేజ్.. మూడేళ్లలో 100కు పైగా కథలు విని, ఎట్టకేలకు దర్శకుడు మహేష్ ఎస్ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. AK ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్తో నిర్మించనున్న ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయట. జూలైలో అధికారిక ప్రకటన, వెంటనే షూటింగ్ ఉండనున్నట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.