MNCL: మొక్కలతోనే మనిషికి మంచి భవిష్యత్ ఉంటుందని జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పచ్చదనాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.