HNK: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంతోశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హనుమకొండలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ నాయకులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.