KNR: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైదాపూర్ మండలం రాయికల్ జలపాతం సమీపంలో శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అటవీశాఖ అధికారిణి శ్రీలత ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీట్ ఆఫీసర్ శ్రీనివాస్, ఏఎంసీ ఛైర్మన్ దొంత సుధాకర్, నాయకులు పాల్గొన్నారు.