ADB: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టరేట్ హాల్లో శుక్రవారం నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు.