E.G: రాజమండ్రిలోని పలు ప్రాంతాల్లో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శుక్రవారం సైకిల్‌పై పర్యటించారు. ఈ సందర్భంగా నగర ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హిత మార్గాలను అలవర్చుకోవాలని సూచించారు. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.