నెల్లూరు: వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో సంగం బస్ స్టాండ్ సెంటర్లో శుక్రవారం వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచిందంటూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వైసీపీ నేతలు కరపత్రాలను దహనం చేశారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను సీఎం చంద్రబాబు దగా చేశారని వైసీపీ అధికార ప్రతినిధి కరిముల్లా పేర్కొన్నారు.