‘జన నాయగన్’ లీక్ కేసులో తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. SM, మెసేజింగ్ యాప్స్ ద్వారా లీక్డ్ కంటెంట్‌ను వైరల్ చేసినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. నిందితుల నుంచి ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌కు పంపారు. లీక్ మూలాలను, దీని వెనుక ఉన్న పెద్ద పైరసీ నెట్‌వర్క్‌ను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.