PLD: నకరికల్లు మండలంలో దారుణం జరిగింది. ఒంటరి మహిళను స్థానిక సచివాలయ ఉద్యోగి సుధాకర్, అతని సోదరుడు శ్రీను ఊరి శివారుకు పిలిపించారు. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి అత్యాచారం చేస్తూ వీడియోలు తీశారు. బాధితురాలి ఫిర్యాదుతో శుక్రవారం ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.