ADB: నార్నూర్ మండలంలోని ఎంపల్లి గ్రామ ఆదివాసీ మహిళలు, పెద్దలు శుక్రవారం పంట విత్తనాలతో విజంగ్ మోహతుర్ పూజలు చేశారు. వర్షాలు బాగా కురవాలని, రైతుల పంటకు దిగుబడులు బాగా పండాలని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాంప్రదాయ పాటలపై నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అమృతరావు, శ్రీరామ్, జ్యోతిరామ్, జాంబీరావు, జలపత్ పాల్గొన్నారు.