HYD: అత్తాపూర్‌లో నిబంధనలకు విరుద్ధంగా, అపరిశుభ్ర వాతావరణంలో నడుస్తున్న ఒక బేకరీ యూనిట్‌పై హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం దాడి చేసింది. ఈ అక్రమ కేంద్రాన్ని సీజ్ చేసి, నిందితుడైన మహ్మద్ అహ్మద్ (45)ను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం అతడిని సర్కిల్-20 అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.