VSP: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖ రేంజ్ పోలీసు కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ రేంజ్ ఐజీ గోపినాథ్ జెట్టి అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్న ఐజీ, మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా ముఖ్యమని అన్నారు.