TG: HYD కోహెడలో అంతర్జాతీయ సదుపాయాలతో ఇంటిగ్రేటెడ్ పండ్ల మార్కెట్కు CM రేవంత్ రేపు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. మార్కెట్ కోసం 239 ఎకరాలిచ్చిన రైతులకు కృతజ్ఞతలు చెప్పారు. పశ్చిమాసియా యుద్ధం వల్ల ఎరువుల కొరత, కేంద్రం సుంకాలు తగ్గించడం వల్ల పత్తి, పామాయిల్ రైతులకు నష్టం జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ.లక్ష కోట్లు జమ చేసిందన్నారు.