తెలంగాణలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పందించారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం న్యాయమా? అని ఆయన ప్రశ్నించారు. ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చమని ప్రజలు నిలదీస్తుంటే.. అవి మానేసి ఈ గొడవలు ఎందుకని నిలదీశారు. జూన్ 14న హ్యూస్టన్లో తాను నిర్వహించబోయే పెద్ద సభకు రావాలంటూ ఈ సందర్భంగా పవన్ను కేఏ పాల్ ఆహ్వానించారు.