ASR: ఎట్టపాక మండలం రంగాపురం గ్రామంలో ప్రభుత్వ సోలార్ ట్యాంకుకు చెందిన సోలార్ ప్లేట్ గాలులకు కిందపడటంతో నీటి సరఫరా నిలిచిపోయింది. గ్రామస్తుల సమాచారం మేరకు సీపీఎం నాయకులు పూణెం వెంకట్రావు, సవలం రాములు విషయాన్ని పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. కార్యదర్శి, ఇంజినీరింగ్ అసిస్టెంట్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి తెగిపోయిన వైర్లకు మరమ్మతులు చేశారు.