TG: రాష్ట్రంలో మైనింగ్ అక్రమాలపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, మహబూబాబాద్లలోని ఆరు ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆయా జిల్లాల్లో మైనింగ్ ఏడీల నుంచి, క్వారీల దగ్గర వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే క్వారీల విషయంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన సీఐడీ, పూర్తి విచారణ జరిపి 6 నెలల్లోపు నివేదిక సిద్ధం చేయనుంది.