AP: ప్రొద్దుటూరు టీడీపీ నేత ప్రవీణ్‌కుమార్ రెడ్డికి స్పీడ్ పోస్టు ద్వారా బెదిరింపు లేఖ వచ్చింది. తన తాతను చంపినట్లే, తనను కూడా ఇంట్లోనే చంపేస్తామని ఆ లేఖలో పేర్కొన్నట్లు ప్రవీణ్ తెలిపారు. తన జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించిన ఆయన, ఈ బెదిరింపులపై పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.