CTR: ఆంధ్రప్రదేశ్లో అర్హులైన ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తెలిపారు. పుత్తూరు మున్సిపాలిటీ జండామాను వీధిలో ‘ఎన్టీఆర్-పీఎంఏవై 2.0 పథకం’ కింద నిర్మించిన ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.