KDP: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మైదుకూరు మున్సిపల్ కమిషనర్ రంగస్వామి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. స్థానిక వనిపెంట రోడ్డులోని ఎర్ర చెరువు చుట్టూ పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు.ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు బాధ్యతగా మొక్కలు నాటాలని కమిషనర్ పిలుపునిచ్చారు.