HYD: తెలంగాణలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానాలను రద్దు చేసి శాశ్వత నియామకాలు చేపట్టాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. జూన్ 11న రాష్ట్రవ్యాప్తంగా నిరసన ధర్నాలు నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. ధర్నాకు సంబంధించిన గోడపత్రికను తార్నాకలో ఇవాళ ఆవిష్కరించారు.