అన్నమయ్య: రాయచోటి ప్రతిపాదిత ఆధునిక నూతన బస్ స్టేషన్ డీపీఆర్‌ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. అధికారులు బస్ స్టేషన్‌కు సంబంధించిన నమూనాలు, వసతులు, నిర్మాణ అంచనాల వివరాలను మంత్రికి వివరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాయచోటి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.