BHPL: భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం TRP ఆధ్వర్యంలో ‘రాజ్యాధికార సమరభేరి’ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు TRP మొగుళ్లపల్లి (M) అధ్యక్షులు రాజేష్ తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల హక్కుల సాధన కోసం ఈ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మండల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలన్నారు.