BHNG: గుండాల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు 2026-2027 విద్యా సంవత్సరానికి గాను బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లలను ప్రైవేటు పాఠశాలకు పంపించకుండా, అన్ని వసతులున్న ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం, జి. చంద్రకళ, జి. బాలరాజు, కృష్ణయ్య, గంగాభవాని, లింగయ్య పాల్గొన్నారు.