JN: జిల్లా చీటకోడూరు గ్రామంలో పాఠశాల HM ఆధ్వర్యంలో “బడిబాట” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్పంచ్ కూకట్ల యాదగిరి హాజరై, మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సదుపాయాలు, నాణ్యమైన విద్యను వినియోగించుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. చదువే తలరాతలను మారుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.