అన్నమయ్య: మదనపల్లె మండలంలో పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిపై బండరాళ్లతో దాడి జరిగిన ఘటన గురువారం కలకలం రేపింది. అమ్మ చెరువు మిట్ట ప్రాంతానికి చెందిన జయకుమార్ (35)ను, అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాసులు మాట్లాడే పని ఉందని పిలిచి, అనంతరం దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. కుటుంబ సభ్యులు బాధితుడిని చికిత్స నిమిత్తం స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు.