MNCL: కోటపెల్లి మండలం శంకరపూర్లో మంగళవారం ఉదయం చెన్నూరు రూరల్ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు కార్డాన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీసులు గ్రామంలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి వాహనాలకు సంబంధించిన సరియైన పత్రాలను పరిశీలించారు. అనంతరం సరైన పత్రాలు లేని పలువురి వాహనాలకు జరిమానా విధించి కౌన్సిలింగ్ నిర్వహించారు.