ATP: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తన నివాసం నుంచి కలెక్టరేట్ వరకు సైకిల్ తొక్కుతూ వెళ్లారు. కలెక్టరేట్ వద్ద కలెక్టర్ ఓ.ఆనంద్‌తో కలిసి పర్యావరణ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ వారంలో ఒకరోజు ఇంధన వాహనాలను పక్కన పెట్టి సైకిల్ తొక్కాలని, దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఇంధనం పొదుపు అవుతుందన్నారు.