రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వచ్చిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. జూన్ 4న విడుదలైన ఈ మూవీ తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.112 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దేశీయంగా రూ.69.50 కోట్ల నెట్ (రూ.82 కోట్ల గ్రాస్), ఓవర్సీస్లో రూ.30 కోట్లు సాధించి చరణ్ కెరీర్ బెస్ట్ ఓపెనర్‌గా నిలిచినట్లు పేర్కొన్నాయి.