SDPT: నంగునూరు మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి వస్తున్న ధాన్యాన్ని నిల్వ చేయడానికి గట్లమల్యాల, పాలమాకుల గ్రామాల్లోని గోదాముల్లో నిల్వ చేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినట్లు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి తెలిపారు. ఇంచార్జి మంత్రి వివేక్ చొరవతో ప్రభుత్వ యంత్రాంగానికి సూచనలు అందాయని పేర్కొన్నారు.