ELR: ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలన ప్రజల కోసం అంకితమైందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామ్ శేషు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెంలో ఆయన మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, విద్యా విధానంలో సమూల మార్పులు, ప్రపంచస్థాయి సంస్థల ద్వారా భారీ పెట్టుబడులను ఆకర్షించామని రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలపై డీఎస్సీ ద్వారా ప్రభుత్వం చేస్తున్న పనిని గమనించాలన్నారు.