PLD: పిడుగురాళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 9న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు స్కిల్ హబ్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ మేళాలో దాదాపు 12 ప్రముఖ కంపెనీలు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి. 18 నుంచి 35 ఏళ్ల లోపు ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు https://naipunyam.ap.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.