KRNL: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దకడబూరు మండలం బసలదొడ్డి గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు మల్లికార్జున ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం ద్వారా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పి. మల్లికార్జున, జట్టే హనుమంతు, కె. రామాంజనేయులు ఉన్నారు.