KDP: పులివెందుల పట్టణంలోని అంకాలమ్మ ఆలయ ఆవరణలో గురువారం ఆలయాల హుండీల ఆదాయాన్ని లెక్కించారు. ఆలయ ఛైర్మన్ బ్యాటరీ ప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది లెక్కించారు. అంకాలమ్మ ఆలయంలో హుండీల ద్వారా రూ.1,45,799, పడమటి ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ ద్వారా రూ. 77,135, మిట్ట మల్లేశ్వరస్వామి ఆలయానికి రూ. 86,447, మొత్తం రూ. 3,09,381 ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపారు.