ASR: రంపచోడవరం మండలం ఇర్లపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పోలీసులు పలు చట్టాలపై శనివారం అవగాహన కల్పించారు. సీఐ సన్యాసి నాయుడు, ఎస్సై వెంకట్రావు విద్యార్థినుల హక్కులు వాటిని ఎలా రక్షించుకోవాలనే విషయాలను వివరించారు. ఎటువంటి సమస్యలు ఉన్నా దైర్యంగా ఎదుర్కోవాలని, భయపడవద్దని భరోసా కల్పించారు. అలాగే, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు.